Site icon NTV Telugu

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌పై మలయాళ సింగర్ విమర్శలు..

Jhanvi

Jhanvi

యంగ్ & టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. లీడింగ్ హీరోల సరసన నటిస్తూ, తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్న ఈ స్టార్ కిడ్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ చుట్టూ ఓ వివాదం చెలరేగింది.

Also Read : Bedroom : మీ బెడ్‌రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు !

సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రాని ‘ఛావా’ హిట్ అందుకున్న మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఆగస్టు 29న హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ మలయాళీ అమ్మాయి పాత్రలో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె లుక్, యాక్సెంట్, డ్రెస్ స్టైల్‌ మీద సోషల్ మీడియాలో మంచి బజ్ వచ్చింది. అయితే ఈ పాత్రపై మలయాళ సింగర్ పవిత్ర మీనన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మలయాళ అమ్మాయి పాత్రకు ఎందుకు మలయాళం నటి కాకుండా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు..

జాన్వీ మలయాళ యాక్సెంట్‌ను కూడా విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాసేపటికే వైరల్ కావడంతో చర్చలు ముదిరాయి. పవిత్ర వీడియోకి రిప్లైగా జాన్వీ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన పోస్ట్‌ను డిలీట్ చేయాలంటూ రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో తొలగించబడింది. అయితే, దానిపై కూడా పవిత్ర రియాక్ట్ అవుతూ స్క్రీన్‌షాట్లు షేర్ చేయడంతో ఈ వివాదం మరింత హైలైట్ అయ్యింది. ఇక..ఈ ఘటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు పవిత్రకు సపోర్ట్ ఇస్తూ, రీజనల్ రోల్స్‌లో ఆ భాషా నటులనే తీసుకోవాలని వాదిస్తే, మరికొందరు మాత్రం జాన్వీని ఇలా విమర్శించడం తప్పని కామెంట్స్ చేశారు.

Exit mobile version