Site icon NTV Telugu

పెయింటింగ్ డేస్ ఆర్ బ్యాక్ అంటున్న జాహ్నవి

Janhvi Kapoor says 'painting days are back'

కరోనా మన కళాకారులలోని కొత్త కోణాలను బయటకు తీస్తోంది. గతేడాది కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. నాలుగు గోడలకే పరిమితం అయిన వారిలో కొందరు తమ హిడెన్ టాలెంట్ ను బయటకు తీశారు. అలా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తనలోని పెయింటింగ్ కళాకారణి ని బట్టబయలు చేసింది. చక్కటి పెయింగ్స్ వేసి తన ఇన్ ష్టాలో పెట్టేసింది జాహ్నవి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ జాను మరోసారి తన పెయింటింగ్ పని మొదలెట్టింది. వేసిన పెయింటింగ్స్ ను ఇప్పుడు కూడా ఇన్ ష్టాలో పోస్ట్ చేసింది. ప్రకృతిని, భక్తిని ప్రతిబింబించేలా ఉన్న పెయింట్స్ కి క్యాప్షన్ గా ‘పెయింటింగ్ డేస్ ఆర్ బ్యాక్’ అని పెట్టింది. గత వారం రోజుగా ఈ పనిమీదే ఉన్నట్లు చెబుతోంది. అంతే కాదు ‘స్టే హోమ్ స్టే సేఫ్‌, ఫైట్ కరోనా’ వంటి హ్యాష్‌ ట్యాగ్స్ జోడించింది. అమ్మడి లోని ఆర్ట్ కు పలువురు ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల ‘రూహి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన జాన్వీ త్వరలో కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘గుడ్ లక్ జెర్రీ’తో పలకరించనుంది. అంతే కాదు ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా2’, ‘తక్త్’ సినిమాలలోనూ నటించబోతోంది. మరి రాబోయే రోజుల్లో ఇళ్ళకే పరిమితమైన మన సినీ కళాకారుల్లో ఇంకెంత మంది జాన్వీ కపూర్ లా తమ హిడెన్ టాలెంట్ ను బయటకు తీస్తారో చూడాలి.

Exit mobile version