Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Janhvi Kapoor Praises Ishaan Khatters Talent Talks About Homebound Cannes Success

Janhvi Kapoor: ఆ హీరో చాలా టాలెంటెడ్.. కానీ తగిన గుర్తింపు రాలేదు

Published Date :September 13, 2025 , 2:22 pm
By Mounika
Janhvi Kapoor: ఆ హీరో చాలా టాలెంటెడ్.. కానీ తగిన గుర్తింపు రాలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జాన్వీ కపూర్‌ తాజాగా తన సినిమా ‘హోమ్‌బౌండ్‌’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడినప్పుడు లభించిన స్పందన సినిమా బృందానికి గర్వకారణమైంది. ఇందులో భాగంగా..

Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ కు సంక్రాంతి కష్టాలు..

జాన్వీ మాట్లాడుతూ.. “ఇది చాలా అద్భుతమైన కథ. నా కెరీర్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుందో అనుకోవడం కాకుండా, కథ నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో వెంటనే అంగీకరించాను. ప్రతి సన్నివేశం పైన శ్రద్ధ పెట్టాం. కేన్స్‌లో ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూసినప్పుడు మేమంతా ఆశ్చర్యపోయాం. నిజానికి ఈ సినిమా చేసినందుకు నన్ను ట్రోల్‌ చేస్తారేమో అనే భయం కూడా రాలేదు. ఇక ఇషాన్‌ ఖట్టర్‌ గురించి మాట్లాడాలి.. అతడు భారతీయ సినిమాలో అత్యంత ప్రతిభావంతులలో ఒకడు. కానీ ఇప్పటి వరకు అతనికి తగిన గుర్తింపు రాలేదు. కేన్స్‌ వేదికపై ప్రపంచం అతని నటనను ప్రశంసించడం చూసి నాకు ఎంతో సంతోషం కలిగింది. కష్టపడే వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఇక్కడ మరోసారి నిరూపితమైంది” అని జాన్వీ ప్రశంసలు కురిపించారు.

‘హోమ్‌బౌండ్‌’ అనేది ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చూపించే హృద్యమైన కథ. దర్శకుడు నీరజ్‌ ఘైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌తో పాటు విశాల్‌ జెత్వా కీలక పాత్రలు పోషించారు. కేన్స్‌లోనే కాకుండా, ఇటీవల ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (IFFM)లో కూడా ఈ సినిమా మెప్పించింది. ఉత్తమ చిత్రంగా, అలాగే నీరజ్‌ ఘైవాన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డులు రావడం ఈ చిత్రానికి గౌరవాన్ని మరింత పెంచింది. మొత్తంగా, జాన్వీ వ్యాఖ్యల వల్ల ఇషాన్‌ ప్రతిభపై మళ్లీ చర్చ మొదలైంది. అలాగే ‘హోమ్‌బౌండ్‌’ ఒక కంటెంట్‌ డ్రైవెన్‌ సినిమా గా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Homebound IFFM awards
  • Homebound movie review
  • Ishaan Khatter recognition
  • Ishaan Khatter talent
  • Janhvi Kapoor Cannes film

తాజావార్తలు

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions