Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?

Janvi Kapoor

Janvi Kapoor

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ఆనందంలో ఉండగానే.. ఒక సరికొత్త వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. అందులో.. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్‌కు జరిగిన అత్యంత అవమానం’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడం ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. పెద్ది సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో నటించింది జాన్వీ. అయితే, తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తితోనే.. జాన్వీ ఆ నెగెటివ్ పోస్ట్‌ను లైక్ చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, ఆమె పొరపాటున లైక్ బటన్ నొక్కి ఉంటుందని కూడా కొందరు భావించారు. అయితే, ఈ వ్యవహారం వివాదంగా మారుతోందని గ్రహించిన జాన్వీ, వెంటనే అప్రమత్తమై ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె అన్‌లైక్ చేయడానికి ముందే నెటిజన్లు లైక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. మరి నిజంగానే.. జాన్వీ తన పాత్ర విషయంలో హర్ట్ అయిందా? లేక అలా జరిగిపోయిందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

×
×
Ad