పెద్ద తెరపై జాన్వీ పరిస్థితి ఏంటి అంటే చెప్పటం కష్టమే! కానీ, స్మార్ట్ స్క్రీన్ మీద మాత్రం హాట్ బ్యూటీ చెలరేగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాను విజువల్ ట్రీట్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టుచీర మొదలు బికినీ వరకూ అన్నీ ప్రయోగిస్తుంటుంది యంగ్ లేడీ! ఫోటోషూట్లే కాదు సెల్ఫీలతోనూ నెటిజన్స్ ను మాయ చేయటం జాన్వీకి పరిపాటి. లెటెస్ట్ గా మరో సెల్ఫీ దుమారం రేపింది… పొట్టి డ్రెస్ లో!
Read Also : 300 కోట్లు కాదు ఇంకా ఎక్కువ బడ్జెట్ తో మధు మంతెన ‘రామాయణం’!
అప్పుడప్పుడూ సెల్ఫీలతో అలరించే సెన్సేషనల్ జాన్వీ తాజాగా బ్లాక్ ఫ్లోరల్ డ్రస్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. మిర్రర్ సెల్ఫీలో మిలమిల మెరిసిపోయిన ఆమె ఫాలోయర్స్ ను సహజంగానే మెస్మరైజ్ చేసింది. ఫైర్, లవ్ ఎమోజీస్ తో వారు జాన్వీ మీద ప్రేమని చాటుకున్నారు. అయితే, మరో హాట్ బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా కూడా లేడీ కపూర్ ని చూసి తాళలేకపోయింది! ‘గార్జియస్’ అంటూ హార్ట్ సింబల్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసింది! ఇక బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా కూడా రెడ్ లవ్ సింబల్ తో జాన్వీపై ఇష్టాన్ని చాటుకున్నాడు…
సొషల్ మీడియాలో రెగ్యులర్ గా హల్ చల్ చేసే జాన్వీ కపూర్ త్వరలో ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాతో బాక్సాఫీస్ ను పలకరించనుంది. ఆ తరువాత ‘దోస్తానా 2’, ‘హెలెన్’ మూవీ రిమేక్ సినిమాల్లో నటించబోతోంది. మొత్తంగా సెల్ఫీ క్వీన్ జాన్వీ చేతి నిండా పనితో బిజిబిజీగా అయితే ఉంది…
