NTV Telugu Site icon

Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!

Nani

Nani

Janhvi Kapoor is Not okay for Nani Says Nani Fans: దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని సుధాకర్ నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఆమె ఖరారు అయినట్లే. అయితే ఈ విషయంలోనే నాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్, నాని జోడి ఏమాత్రం సెట్ కాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

Pushpa 2: ఏం పర్లేదు ఏం పర్లేదు.. అంతా ఓకే!

వాస్తవానికి నాని సినిమాల కథల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటాడో తన పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో కూడా అంతే కచ్చితంగా ఉంటాడు. అయితే ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా విషయంలో మాత్రం అది మిస్ ఫైర్ అయింది. అందుకే మృణాళ్, నాని మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వలేదు సరి కదా అదే సినిమాకి మైనస్ గా మారింది. ఇప్పుడు జాన్వీ కపూర్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందని నాని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరోసారి ఆలోచిస్తే బెటర్ అంటూ నానికి సోషల్ మీడియా వేదికగా సలహాలిస్తున్నారు. అయితే ఇందులో నాని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. జాన్వి కపూర్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ తేజ 16వ సినిమాలో కూడా నటిస్తోంది ఈ సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు.

Show comments