NTV Telugu Site icon

జాన్వి, సారా ‘గోల్డెన్ గ్లో’ రహస్యం ఇదేనట… వీడియో వైరల్

Janhvi Kapoor and Sara Ali Khan workout together

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి పని చేస్తున్న వీడియోను సారా అలీఖాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జాన్వి కపూర్ గులాబీ, నారింజ రంగు దుస్తులు ధరించగా, సారా అలీ ఖాన్ ఎరుపు, నలుపు రంగు అథ్లెటిక్ దుస్తులను ధరించారు. ‘గోల్డెన్ గలౌ పొందాలంటే ఇలా చేయండి. సూచనల కోసం నమ్రత పురోహిత్ ను అడగండి’ అంటూ తమ పర్సనల్ ట్రైనర్ ను పరిచయం చేసింది సారా. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక సారా, జాన్వీ అతి తక్కువ వ్యవధిలోనే భారీ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే… సారా అలీఖాన్ చివరగా వరుణ్ ధావన్ ‘కూలీ నెం. 1’ రీమేక్ లో కన్పించారు. ప్రస్తుతం సారా ‘అత్రాంగి రే’ అనే చిత్రంలో ధనుష్, అక్షయ్ కుమార్ లతో కలిసి పని చేస్తున్నారు. మరోవైపు జాన్వీ చివరిసారిగా ‘రూహీ’లో కన్పించారు. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.