NTV Telugu Site icon

Avatar The Way Of Water: ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కన్నడ ట్రైలర్ రిలీజ్

Avatar The Way Of Water

Avatar The Way Of Water

Avatar The Way Of Water: ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి అంతా డిసెంబర్ 16 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 2’ విడుదల కాబోతోంది. ‘అవతార్’ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాతో పాటు తమ తమ సినిమాలను రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయటం లేదు. ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ‘అవతార్ 2’ రిలీజ్ కాబోతోంది. జేమ్స్ కామెరూన్‌తో కలిసి పలు చిత్రాలను అందించిన నిర్మాత, ఆస్కార్ విజేత జోన్ లాండౌ ఈ సినిమాను కూడా అందిస్తున్నారు. భారతీయ సంస్కృతి, మన దేశం పట్ల ఆయనకున్న అభిమానాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో కన్నడ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘మీరు #AvatarTheWayOfWaterని 6 భాషలలో – ఇంగ్లీషు, హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో ఆస్వాదించనున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. డిసెంబర్ 16న పండోరలో సెలబ్రేషన్ జరుపుకుందాం. దయచేసి కన్నడ ట్రైలర్‌ని ఆస్వాదించండి’ అంటూ ట్వీట్ చేశారు నిర్మాత జాన్ లాండౌ.

Show comments