Site icon NTV Telugu

Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ

Nagarjuna Jarinikanth

Nagarjuna Jarinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రజినీ అప్పుడే తన నెక్స్ట్ చిత్రం ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాడు. దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మూవీకి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా..

Also Read : Ravina Tandar : కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వెంకటేష్ హీరోయిన్..

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను మేకర్స్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీతో కలిసి ‘కూలీ’‌లో నాగ్ నటించాడు. ఇక ‘జైలర్ 2’ లో కూడా నాగార్జన ను విలన్ పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు టాక్. అయితే, నాగ్ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలుస్తోంది. ఏదేమైనా నాగ్ తమిళ సూపర్ స్టార్ సినిమాలో, విలన్‌గా నటిస్తాడనే వార్త తమిళ మీడియాల్లో, తెగ చక్కర్లు కొడుతున్నప్పటికి.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం కాస్త ఇబ్బంది అయిన వార్త అని చెప్పాలి. ఎందుకంటే మూడున్నర దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో, నాగార్జున లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి విలన్‌గా అంటే ఫ్యాన్స్‌కి కాస్త కష్టంగా అనిపించవచ్చు..

Exit mobile version