Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సంచలన విజయానికి సీక్వెల్‌గా సిద్ధమవుతున్న ‘జైలర్ 2’పై ఇప్పుడు సినీ వర్గాల్లో కనీవినీ ఎరుగని హైప్ నెలకొంది. ఈ క్రేజ్‌ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సన్ పిక్చర్స్ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో వినిపిస్తున్న లెక్కలు ట్రేడ్ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ ధరకు తెలుగు రైట్స్ అమ్ముడుపోవడం టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీసింది. ‘రోబో’ తర్వాత రజినీకాంత్ సరైన విజయం లేక వరుస ఫ్లాపులతో సతమతమైన తరుణంలో ‘జైలర్’ విడుదలైంది. సూపర్ స్టార్ గత చిత్రాల రిజల్ట్ కారణంగా ఆ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను కేవలం రూ.12 కోట్ల మొత్తానికే విక్రయించారు. అయితే సినిమాకు బ్లాక్‌బస్టర్ పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.48 కోట్ల షేర్ రాబట్టి, బయ్యర్లకు నాలుగు రెట్లు కళ్లుచెదిరే లాభాలను తెచ్చిపెట్టిందని ట్రేడ్ రిపోర్ట్ చెబుతుంది.
ఆ సక్సెస్ ఊపుతో ఇప్పుడు ‘జైలర్ 2’ తెలుగు రైట్స్‌కి ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా రూ.45 కోట్ల భారీ మొత్తం వెచ్చించి తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌కి పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ భారీ పెట్టుబడి వెనుక అంతే పెద్ద ముప్పు కూడా పొంచి ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. దసరా పండుగ బరిలో ‘జైలర్ 2’తో పాటు ‘రణబాలి’, ‘ఆదర్శ కుటుంబం’ వంటి క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే సినిమాకు కేవలం హిట్ టాక్ వస్తే సరిపోదు.. పండగ బరిలోని ఇతర సినిమాల కంటే అత్యుత్తమంగా ఉందనే టాక్ రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ రూ.45 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు. ‘జైలర్’ తర్వాత వచ్చిన ‘వెట్టయాన్’, ‘కూలీ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు ‘జైలర్ 2’ రజినీకి ఎలాగైనా భారీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల మధ్య ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.122 కోట్ల రైట్స్ అమ్ముడై రూ.295 కోట్ల షేర్, రూ.606 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ.. సీక్వెల్స్ విషయంలో కోలీవుడ్‌ను ఓ సెంటిమెంట్ భయం వెంటాడుతోంది. గతంలో వచ్చిన ‘భారతీయుడు 2’, ‘పందెంకోడి 2’, ‘సర్దార్ 2’, ‘చంద్రముఖి 2’ వంటి భారీ సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలను మిగిల్చాయి. మరి ఈ ఫ్లాప్ సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేస్తూ, పెట్టిన భారీ పెట్టుబడులను దాటి రజినీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంటారో లేదో చూడాలి.
Also Read
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
తాజావార్తలు
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?