Site icon NTV Telugu

Jai Jawan : ఆసక్తికరంగా ‘ జై జవాన్‌’ ట్రయిలర్‌

Jawan Trailer

Jawan Trailer

సంతోష్‌ కల్వచెర్ల హీరోగా పావని రామిశెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన తాజా ఇండిపెండెంట్ ఫిలిం జై జవాన్. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌, బాల పరసార్‌, సంజన చౌదరి ముఖ్య పాత్రలలో ఈ ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ ను తెరకెక్కించారు. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ ను నిర్మించారు. దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుల గొప్పదనాన్ని తెలియజేసే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.

Dear Uma: ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ‘డియర్ ఉమ’

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయిలర్‌ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ విజయం సాధించాలని విషెస్‌ అందజేశారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే దేశభక్తి వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు.’ప్రాణం తీసే ఆయుధాలంటే భయం లేదు నాకు…చావు కోరే శత్రువులంటే కోపం రాదు’ అంటూ తనికెళ్ల భరణి చెప్పిన సంభాషణ… ‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని, జీవితానిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్‌ మాత్రమే’ అని సాయికుమార్‌ చెప్పిన డైలాగులు వింటూంటే గూస్‌బంప్స్‌ వచ్చే విధంగా వున్నాయి.ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకుంటుంది.

Exit mobile version