NTV Telugu Site icon

Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్..

Whatsapp Image 2024 04 17 At 11.37.54 Am

Whatsapp Image 2024 04 17 At 11.37.54 Am

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ మూవీ ఎండింగ్ లోనే సీక్వెల్ కి దర్శకుడు లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే.’జై హనుమాన్’ అంటూ సీక్వెల్ ని ప్రేక్షకులముందుకు తీసుకు రాబోతున్నారు. జై హనుమాన్ మూవీ ఈ సారి మరింత అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు.దీనితో జై హనుమాన్ మూవీ ఫై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుండా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుండా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా ఓ పోస్టర్ డిజైన్ చేసి నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఆ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడింది అది కలియుగంలో రక్షించబడుతుంది అని చిత్ర యూనిట్ పోస్టర్ తో పాటు ఇలా రాసుకొచ్చింది..చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది.జై హనుమాన్ సినిమాలో ఈసారి విజువల్స్ మరింత అద్భుతంగా ఉండనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేసాడు ..త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Show comments