NTV Telugu Site icon

Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫస్ట్ లుక్ రిలీజ్

Jaggareddy

Jaggareddy

సినిమా రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎందరో నటీనటులు ఉన్నత పదవులు అధిరోహించారు. కానీ  ఇప్పుడు ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి’ త్వరలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి  వస్తాను. ప్రస్తుతం ‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’ లో స్పెషల్ రోల్ లో నటిస్తున్నాను. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు ఈ సినిమాలోని రోల్ అద్దం పట్టనుంది. అందుకే ఈ సినిమాలో  నటించిందేందుకు ఒప్పుకున్నాను. పీసీసీ, సిఎం ల అనుమతి తోనే సినిమాలో నటిస్తాను.ఈ ఉగాదికి నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటాను. ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడు. సినిమాలో నటించమని అడిగారు. ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుంది. ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీ తో పాటు పాన్ ఇండియా భాషల్లో  రిలీజ్ కానుంది’ అని అన్నారు.