తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న నటుడు జగపతిబాబు. 1989లో విడుదలైన సింహాసనం సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 90వ దశకంలో ఫ్యామిలీ కథలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులో హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అలా 2014లో లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతిబాబు, తన నటనలో కొత్త కోణాలను చూపింది.. ప్రేక్షకులే కాక విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా నరసింహారెడ్డి, అఖండ, సలార్, రాధే శ్యామ్ వంటి పెద్ద చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతిబాబు.. ఇప్పుడు బుల్లితెరపైకి అడుగుపెడుతున్నారు.
Also Read : Silk Smitha : రాత్రైతే చాలు.. సిల్క్ స్మిత బెడ్‌పై అలా.. సీక్రెట్ బయటపెట్టిన డిస్కో శాంతి
తాజాగా జీ తెలుగు ఛానెల్‌పై ప్రసారంకానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోకి హోస్ట్‌గా జగపతిబాబు వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమోలో ఆయన చెప్పిన మాటలు ఎంతో భావోద్వేగంగా ఉన్నాయి.. ‘జ్ఞాపకం విలువ ఒక జీవితం.. అని నేరుగా చెప్పలేకపోయినా అమ్మకి రాసిన ఉత్తరం, నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం, ఆటకోసమే బ్రతికిన రోజులు, చదువు చదివిన క్షణాలు, అలవాటైన అల్లరి పనులు.. ఇవన్నీ చిన్న చిన్న దొంగతనాలే అయినా.. చివరికి ఒక్కటే లక్ష్యం విజయం.”అని తెలిపారు. ప్రోమో చివర్లో గోడపై పలువురు సినీ సెలబ్రిటీల ఫోటోలు కనిపించడంతో, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు గెస్ట్‌లుగా హాజరవుతారని ఊహించవచ్చు. మరి ఈ షో ద్వారా జగ్గూభాయ్ ఎంతమంది మనసుల్లో జయ మార్గాన్ని సాధిస్తాడో చూడాలి!
