Site icon NTV Telugu

వైట్ క్రాప్ టాప్ లో స్టార్ హీరోయిన్… హాట్ పిక్స్ వైరల్

Jacqueline Fernandez looks smoking hot in all-white crop top and pants

ఇటీవల బాద్షా ‘పానీ పానీ’ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడికి క్రేజ్ కూడా మాములుగా లేదు. తన హాట్ పిక్స్ తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు సంపాదిస్తోంది. తాజాగా జాక్వెలిన్ వైట్ క్రాప్ టాప్ ధరించి దిగిన పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

Read Also : “ఆర్ఆర్ఆర్”పై క్రేజీ అప్డేట్

ఈ హాట్ పిక్ కు గంటల్లోనే లక్షకుపైగా లైకుల వర్షం కురిసింది. పిక్ లో ఆల్-వైట్ ధరించిన జాక్వెలిన్ కు బంగారు నెక్లెస్, చెవిపోగులు, బ్రాస్లెట్ మరింత అందాన్ని జోడించాయి. ఇందులో నవ్వుతూ ఉన్న ఆమె టీజింగ్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోతో పాటు ‘పెర్సెఫోన్ గర్ల్’ అనే కవితను పంచుకుంది. ‘పెర్సెఫోన్ గర్ల్’ అనే పద్యం ఆనందానికి కారణం అయిన అమ్మాయి గురించి ఉంటుంది. నికితా గిల్ రాసిన ఈ పద్యాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాగా ఇప్పుడు జాక్వెలిన్ కిట్టిలో కొన్ని పెద్ద బ్యానర్ సినిమాలు ఉన్నాయి. ఆ జాబితాలో ‘బచ్చన్ పాండే’, ‘కిక్ 2’, ‘భూత్ పోలీస్’, ‘రామ్ సేతు’, ‘సర్కస్’ వంటి భారీ మూవీస్ ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

Exit mobile version