ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం.
కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.కోట్లుకు అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ రైట్స్ మైత్రి మూవీస్ రూ3 కోట్లు, ఆంధ్ర రైట్స్ ఏషియాన్, సురేష్ సంస్థలు రూ. 4 కోట్లకు కొనుగోలు చేసాయి. అన్ని అమ్మకాలు పూర్తి అవగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ రూ. 6కోట్లు లాభాలు తెచ్చిపెటింది. ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చిన చిత్రం డార్లింగ్.
నిరంజన్ రెడ్డి పట్టుకున్న ప్రతి సినిమా లాభాలే లాభాలు, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ చిత్రం దాదాపు రూ. 100 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డార్లింగ్. మరోవైపు నిర్మాత నిరంజన్ రెడ్డి పూరి, రామ్ ల డబల్ ఇస్మార్ట్ ఆల్ ఇండియా థియేట్రీకల్ రైట్స్ ను రూ. కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా కూడా హిట్ కానుందని నిరంజన్ రెడ్డి ఈ చిత్రం కూడా గిట్టుబాటు అవుతుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. కాగా డార్లింగ్ చిత్రాన్ని కంటెంట్ పై నమ్మకంతో ఈ రోజు పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. జులై 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది డార్లింగ్.