Site icon NTV Telugu

టైగర్​ ష్రాఫ్​-దిశాపటానీ రిలేషన్​షిప్ పై.. టైగర్​ తండ్రి క్లారిటీ

బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్​ ష్రాఫ్​-దిశాపటానీ రిలేషన్​షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్​ తండ్రి, సీనియర్​ నటుడు జాకీ ష్రాఫ్​ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్​ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదన్నాడు. అయినా టైగర్​కు అన్నింటికన్నా పని మీద ఎక్కువ దృష్టి పెడతాడని జాకీ ష్రాఫ్ జూన్​ 20న ఫాదర్స్​ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టైగర్ ‘హీరోపంతి 2’, ‘బాఘీ 4’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Exit mobile version