సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ లో 80 శాతం చిత్రీకరణ కంప్లిట్ చేసారు మేకర్స్.
Also Read : Ashok Galla : మహేష్ బాబు మేనల్లుడి ‘దేవకినందనవాసుదేవ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇటీవల ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 15 నుంచి నేపాల్‌లో స్టార్ట్ చేసారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బర్త్ డే వేడుకలు ఎస్ నేపాల్ షూట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. కాగా జెట్ స్ప్పేడ్ లో జరుగుతున్న ఈ సినిమా నేపాల్ షెడ్యూల్ ముగించింది యూనిట్. అందుకు సంభందించి వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. తమిళ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో తెలుగులో నేను మీకు తెలుసా, రా రా కృష్ణయ్య వంటి సినిమాలకు అచ్చు సంగీతం అందించాడు. జాక్ చిత్రంలోసిద్ధు జొన్నలగడ్డ క్రాక్ గాడు ఎందుకుంటాడనేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. సిద్దు సరేసన బేబి సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది. చక చక షూటింగ్ ముగించి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్ . ప్రసాద్.
#JACK Wraps up the Nepal schedule on a tremendous high 😍
Big screens are in for endless entertainment 💯 #SidduJonnalagadda@iamvaishnavi04@baskifilmz @SVCCofficial #SVCC37 #JackTheMovie pic.twitter.com/toP6ofps3e
— SVCC (@SVCCofficial) October 5, 2024