Site icon NTV Telugu

Jack: సిద్ధూ’కే క్రెడిట్ అంతా!!

Siddu Jonnalagadda

Siddu Jonnalagadda

ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన జాక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఈ సినిమా కంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు అతనికి యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే, జాక్ విషయంలో మాత్రం అది పూర్తిగా బోల్తా పడింది. నిజానికి, ఈ సినిమా దర్శకుడు భాస్కర్, హీరో సిద్ధు జొన్నలగడ్డ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే, అదేమీ లేదని అటు దర్శకుడు, ఇటు హీరో కూడా ప్రెస్ మీట్స్‌లో చెప్పుకొచ్చారు.

Tahawwur Rana: పాక్ ఆర్మీ అంటే ప్రేమ, ఐఎస్ఐతో పరిచయం.. విచారణలో సంచలన విషయాలు..

అయితే, గురువారం నాడు సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ బాగాలేదు, కంటెంట్ కూడా చాలా మందికి నచ్చలేదు. ఈ సినిమా కారణంగా నిర్మాత భారీగానే ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా, ఒక సినిమా ఆడకపోతే ఆ సినిమా దర్శకుడిపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం సిద్ధు జొన్నలగడ్డపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్‌మెంట్ సినిమాలో ఉందని ముందు నుంచి ప్రచారం జరగడమే దానికి కారణం అయి ఉండవచ్చు. దానికి తోడు, సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. సినిమా అంతా సిద్ధు జొన్నలగడ్డ మార్క్ కనిపించడంతో, ఈ సినిమా ఇబ్బంది పడడానికి కారణం సిద్ధు అనే విషయాన్ని ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు.

Exit mobile version