కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా జోరు మీదున్నాడు. సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’ ను తెరకెక్కించాడు ధనుష్. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు ధనుష్.
ఫిబ్రవరి 21 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ (NEEK) సినిమాను ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే టైటిల్ తో తీసుకువచ్చాడు ధనుష్. సాఫ్ట్ టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ మేనల్లుడికి టాలీవుడ్ లో మంచి స్టార్ట్ లభించింది. కాగా ఇప్పడు ఈ సినిమా ఓటీటీ రిలిజ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ జాన్ ప్రైమ్ దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాలు తర్వాత ఈ నెల 21న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. G.V ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను వండర్ భార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ధనుష్ నిర్మించాడు.థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.