Site icon NTV Telugu

Priyadarshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ ముగిసింది..

Untitled Design (31)

Untitled Design (31)

‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రo ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి , రూప కొడువాయూర్ జంటగా నటించారు. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

Also Read : ARM : విభిన్న చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ చాలా గ్రేట్ : టోవినో థామస్

చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ”ఇటీవల ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ‘సారంగపాణి జాతకం’. నేటితో  చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. నాకు ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేది. మా సంస్థలో జంధ్యాల గారి డైరెక్షన్ లో  ఓ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ, కుదరలేదు. ఆయన  మా సంస్థలో రెండు విజయవంతమైన చిత్రాలు ‘చిన్నోడు – పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలకు డైలాగ్స్ రాశారు కానీ, సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు ఇన్నేళ్లకు  భర్తీ అయ్యింది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఖర్చు పరంగానూ, టెక్నికల్ పరంగానూ  ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం ” అని చెప్పారు.

Exit mobile version