తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు సస్పెన్స్, కామెడీ తోడైతే ఇక ఆ సినిమాకు తిరుగుండదు. సరిగ్గా ఇలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో వచ్చి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న చిత్రమే ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’. తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లిన ఒక సాధారణ వ్యక్తి అకస్మాత్తుగా కోలుకోవడం, ఆ తర్వాత అతనికి ఎక్కడో దూరం నుంచి వచ్చే శబ్దాలు, రహస్య సంభాషణలను కూడా స్పష్టంగా వినగలిగే అసాధారణ సూపర్ పవర్స్ రావడం అనే సెన్సేషనల్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. మనోరమా మ్యాక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ థ్రిల్లర్.. విడుదలైన మొదటి వారంలోనే ఏకంగా 15 మిలియన్ల (కోటిన్నర) నిమిషాలకు పైగా వాచ్ టైమ్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ భాషల్లోనూ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండటంతో నాలుగు భాషల ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలే ‘ప్రేమలు’ సినిమాలో అమల్ డేవిస్ పాత్రతో టాలీవుడ్ యూత్‌కు కూడా విపరీతంగా దగ్గరైన సంగీత్ ప్రతాప్ ఇందులో మెయిన్ లీడ్ (రూబిన్) పాత్రను పోషించగా, విలక్షణ నటుడు షరాఫుద్దీన్ (సూరజ్) ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సూపర్ పవర్స్ వచ్చిన రూబిన్‌కు, పోలీస్ ఆఫీసర్ సూరజ్‌కు మధ్య జరిగే ఊహించని పరిణామాలు, వారిద్దరి ప్రయాణంలో ఎదురయ్యే కిడ్నాప్‌లు, ఛేజింగ్‌లు, దాని చుట్టూ అల్లుకున్న హాస్యం, థ్రిల్లింగ్ ట్విస్టులు ఆడియన్స్‌ను కుర్చీ అంచున కూర్చోబెడతాయి.
డెబ్యూ డైరెక్టర్ శ్యామిన్ గిరీష్ తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ‘కరిక్కు’ ఫేమ్ నీలీన్ సంద్ర అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి. డా. పాల్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ బిగ్ ఫిలిప్స్ బ్యానర్లపై డా. పాల్ వర్గీస్, సుజిత్ జే నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ ముజీబ్ మజీద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ ఫీల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. ప్రస్తుతం 500కి పైగా బ్లాక్‌బస్టర్ సినిమాలు, 20 వేల గంటల ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో దూసుకుపోతున్న మనోరమా మ్యాక్స్ ప్లాట్ఫామ్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేష ఆదరణ పొందుతోంది. అఖిల భార్గవన్, పార్వతి ఆర్. కృష్ణ, కోట్టాయం నసీర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. వినూత్నమైన కథ, అడుగడుగునా నవ్వించే కామెడీ, ఊహించని సస్పెన్స్ కోరుకునే సినీ ప్రియులకు ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్.

