NTV Telugu Site icon

Nithin : నితిన్ కు ఊపిరి పోసిన సినిమా మళ్ళి వస్తోంది..

Ishq

Ishq

జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. కేరీర్ తొలినాళ్లలో నితిన్ వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత నితిన్ డజనుకు పైగా ప్లాప్ సినిమాలు చేసాడు. వేటికవే డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక నితిన్ కెరీర్ క్లోజ్ అయింది అనుకున్న టైమ్ లో వచ్చిన సినిమా ఇష్క్.

Also Read : ENE 2 : ఈ నగరానికి ఏమైంది – 2 చిన్న కథ కాదు..

2012, ఫిబ్రవరి 24న విడుదలైన ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. నితిన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నితిన్ వరుస ప్లాప్స్ కు బ్రేక్ వేసి నితిన్ కు ఊపిరి పోసిన సినిమా ఇష్క్. కాగా 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా గతేడాది నితీన్ బర్త్ డే కానుకగా రీరిలీజ్ అయింది. ఏడాది గ్యాప్ తర్వాత మరోసారి రీరిలీజ్ కు రెడీ అవుతోంది ఇష్క్. ఈ నెల చివర అనగా నవంబరు 30న వరల్డ్ వైడ్ గా ఇష్క్ రిలీజ్ అవుతోంది. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా 2012లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు అందుకుంది. నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్ డిసెంబరు 20న రిలీజ్ కుడి రెడీ గా ఉంది

Show comments