హనుమాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలనుచేస్తున్న ఈయన ఇప్పుడు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు.. బాలీవుడ్ డెబ్యూ చేస్తాడనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీకి ప్లానింగ్ జరుగుతోన్న సంగతి నిజమే కానీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఆ సినిమాకు రాక్షస లేదా బ్రహ్మ రాక్షస అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన ఫాంటసీ కథని ఈ కాంబో కోసం సిద్ధం చేశారట. వినగానే హీరో ఫిదా అయినట్లు తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు ను త్వరగా ఫినిష్ చేసే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు సమాచారం..
ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇటీవల హనుమాన్ జయంతి సందర్బంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మరో రెండు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకుంటాయని వినిపిస్తోంది.. ఈ విధంగా చూసుకుంటే హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న సినిమా జై హనుమాన్ 2026 కే రావచ్చునని టాక్.. ఇంకో రెండు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ ఎలాంటి వండర్స్ ను క్రియేట్ చేస్తాడో చూడాలి..
