Venkatesh : వెంకటేష్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “సైంధవ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను “హిట్ ” మూవీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు.ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో ఆండ్రియా,తమిళ హీరో ఆర్య కీలక పాత్ర పోషించారు.బాలీవుడ్ యాక్టరు నవాజుద్దీన్ సిద్ధికి ఈ సినిమాలో విలన్ గా నటించారు .భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు ఈ సినిమాతో అయిన హిట్ లభిస్తుంది అనుకుంటే ఈ సినిమా కూడా నిరాశపరిచింది.ఇదిలా ఉంటే వెంకటేష్ తన కొత్త సినిమాను తనకు బాగా ఇష్టమైన దర్శకుడి తో చేస్తున్నాడు .ఆ దర్శకుడు ఎవరో కాదు అనిల్ రావిపూడి ..
గతంలో వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఎఫ్ 2 ,ఎఫ్ 3 వంటి సినిమాలు తెరకెక్కించారు .అయితే ఎఫ్ ౩ సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు.ఈ సారి అనిల్ తో చేయబోయే సినిమాలో వెంకటేష్ సోలో హీరోగా నటించనున్నాడు .బాలయ్య తో తెరకెక్కించిన “భగవంత్ కేసరి” సినిమా అద్భుత విజయం సాధించడంతో మంచి జోష్ లో వున్న అనిల్ ఈ సారి వెంకటేష్ కు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా మ్యూజికల్సిట్టింగ్స్ మొదలైనట్లు సమాచారం.జులైలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్ గా ఎంపిక కాగా,మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ఈ అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు గ్రాండ్ర్ గా నిర్మిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!