Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్‌ వేస్ట్‌ అవుతుందా ?

Imanvi

Imanvi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ డెబ్యూట్ మూవీలోనే రెబెల్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమాన్వి నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’లో ఆమె కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఇమాన్వి కెరీర్ ప్లానింగ్‌పై చర్చకు దారితీశాయి.

‘ఫౌజీ’ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటివరకు ఇమాన్వి ఈ ప్రాజెక్ట్ కోసమే దాదాపు రెండేళ్ల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఆమె వయస్సు 30 దాటడంతో కెరీర్‌కు ఎంతో కీలకమైన ఈ సమయంలో ఒకే సినిమాపై ఇన్ని ఏళ్లు వెచ్చించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఫౌజీ సెట్స్‌పై ఉండగానే ఇమాన్వికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలు ఆఫర్లు తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేయడానికి నిరాకరిస్తూ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ప్రభాస్ వంటి బిగ్ స్టార్ సరసన నటిస్తున్నప్పుడు వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుందని భావించింది. వాస్తవానికి ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనుకోని క్వాలిటీ కారణాల వల్ల ఈ సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. దీంతో ఇమాన్వి డెబ్యూట్ మరింత ఆలస్యం కానుంది. బిగ్ ప్రాజెక్ట్ కోసం సైన్ చేసి కామ్‌గా ఉండటం ఆమె కెరీర్‌కి ప్లస్ అవుతుందా లేక వేస్టింగ్ టైమ్ అవుతుందా అనేది ‘ఫౌజీ’ రిజల్ట్ వచ్చాకే తేలనుంది.