IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్‌’ ఈజ్ స్మాల్ వర్డ్

Irumudi 3 Days Collections

Irumudi 3 Days Collections

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సరికొత్త వసూళ్ల రికార్డులను సృష్టిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఇరుముడి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదటి మూడు రోజులు ఎక్కడ చుసిన హౌస్ ఫుల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చిత్ర యూనిట్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం ‘ఇరుముడి’ తొలి రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

ఎటువంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రోజుల్లో   విడుదలైన ఒక ప్రాంతీయ సినిమా అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో రాణించడం అరుదైన రికార్డ్ గా మేకర్స్ ప్రకటించారు. రవితేజ మార్క్ పర్ఫామెన్స్ కు తోడు జీవి ప్రకాష్ సూపర్బ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ తో విజిల్స్ కొట్టిస్తుంది ఇరుముడి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. శివ నిర్వాణ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తుండటంతో ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘బాక్సాఫీస్ ర్యాంపేజ్’ కొనసాగిస్తోంది. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి  వంద కోట్ల మార్క్ ను అందుకోబోతుంది.