“బిగ్ బాస్”కు షాకిస్తున్న కంటెస్టెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారట నిర్వాహకులు. జూమ్ ద్వారా అభ్యర్థుల ఆడిషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం పోటీదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారని సమాచారం. జూలై నెలలో ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ మేరకు నిర్వాహకుల నుంచి త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం “బిగ్ బాస్”కు కంటెస్టెంట్స్ షాక్ ఇస్తున్నారట. బిగ్ బాస్-5 కోసం ఈసారి 19 మంది పోటీదారులు అవసరం. కానీ ప్రదర్శనలో పాల్గొనడానికి సంప్రదించిన చాలా మంది ప్రముఖులు “బిగ్ బాస్” నిర్వాహకుల ఆఫర్లను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. దీంతో “బిగ్ బాస్” నిర్వాహకులకు కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేయడం పెద్ద సవాలుగా మారిందట. కాగా కింగ్ నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!