విభిన్న చిత్రాల కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి “శర్వా30” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నిర్మాతలు.
Read Also : ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్!
ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ‘శర్వా30’ “ఒకే ఒక జీవితం” అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నిరీక్షణ తప్పదు. ఇక ఈ టైటిల్ చూస్తుంటే శర్వానంద్ మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్టుగా అన్పిస్తోంది. కాగా చివరిసారిగా “శ్రీకారం” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో థియేటర్లలోకి వచ్చిన శర్వా ఇప్పుడు “మహాసముద్రం”, “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే చిత్రాలతో బిజీగా ఉన్నారు.
