Site icon NTV Telugu

OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు

Ott Movies

Ott Movies

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం..

మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

షారూఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఓటీటీ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్.. సెప్టెంబర్ 18 నుండి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొడుకు కోసం సిరీస్‌లో సగం బాలీవుడ్ స్టార్లను నింపేశాడు ఫాదర్ కమ్ ప్రొడ్యూసర్ కింగ్ ఖాన్. అలాగే బాలీవుడ్ చీకటి కోణాన్ని ఆవిష్కరించిన ఆర్యన్ ఖాన్.. తన పర్సనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడిన ఓ అంశాన్ని సెటెరికల్ వేలో చూపించాడు.

Also Read : Bandla Ganesh : బన్నీ, వంశీ కష్టపడితే.. అల్లు అరవింద్ క్రెడిట్ కొట్టేస్తారు

ఇప్పటికే విలేజ్ లవ్ స్టోరీ కన్యాకుమారి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 12 ఏళ్ల తర్వాత శ్రీ విష్ణు, శ్రీ ముఖి, హర్ష వర్థన్ రాణే, రీతూ వర్మ, వితిక నటించినప్రేమ ఇష్క్ కాదల్ ఓటీటీ బాట పట్టింది. ఈటీవీ విన్‌లోప్రసారమవుతుంది. ఇక హాలీవుడ్ క్రైమ్ మిస్టరీ, హారర్ యాక్షన్ థ్రిల్లర్స్ బ్లాక్ రాబిట్, సిన్నర్స్ పెప్టెంబర్ 18 నుండే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇక మలయాళ సినిమాల విషయానికి వస్తే.. థ్రిల్లర్స్ సెప్టెంబర్ 19 నుండి సందడి చేస్తున్నాయి. శ్వాసిక రందాం యామం, ధ్యాన్ శ్రీనివాసన్ ఐడీ దీ ఫేక్, టూ మెన్ కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర, సేమ్ డే విత్ సమ్ వన్, బెలెన్, షి సెడ్ మేబి, ది ట్రైయల్ సీజన్2 సిరీస్, బిల్లినియర్స్ బంకర్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Exit mobile version