ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సీరీస్ తో రాబోతోంది. ‘మ్యాన్ వర్సెస్ బీ’ పేరుతో రానున్న ఈ సీరీస్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తేనెటీగ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తి కథతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దీని ట్రైలర్ చూడగానే మన రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రాక మానదు. అంతేకాదు ట్రైలర్‌లోని షాట్స్ కొన్ని ‘ఈగ’లో సుదీప్ వర్సెస్ ఈగ లాగే ఉండటం గమనించదగ్గ అంశం. ఈగ స్ఫూర్తితో చేశారా? లేక మరే ఇతర హాలీవుడ్ సినిమా ఆధారంగా తీస్తున్నారో కానీ రోవాన్ ఫన్నీ చేష్టలతో ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మిస్టర్ బీన్ అభిమానులందరినీ పూర్తి స్థాయిలో అలరించేలా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సీరీస్ ను జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్లిక్స్ లో ప్రదర్శించనున్నారు.
Man vs BEE ‘ఈగ’ను తలపించే మిస్టర్ బీన్ ‘మ్యాన్ వర్సెస్ బీ’

Man Vs Bee