NTV Telugu Site icon

Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?

Untitled Design (1)

Untitled Design (1)

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమా ఇంద్ర.చిరు డైలాగ్‌లు అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. మరి ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. వైజయంతి బ్యానర్ పై నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.

Also Read: Rajnikanth: వెట్టయాన్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల డీల్ క్లోజ్

ఈ చిత్రం విడుదలై ఇటీవల 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర రిరిలీజ్ కు ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఆగస్టు 22న ఇంద్ర రీరిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేయగా నిమిషాల వ్యవధిలో టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి. దింతో మరిన్ని షోస్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తుంటే ఇటీవల రీరిలీజ్ అయిన మురారి 4K(9.12)కోట్ల రూపాయల రికార్డును బద్దలు కొట్టేలాగా ఉంది ఇంద్ర. గమ్మతైనా విషయం ఏంటంటే ఇంద్ర రిలీజ్ టైమ్ లో క్రియేట్ చేసిన రికార్డును పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన పోకిరి (2006)తో బద్దలు కొట్టాడు. ఇప్పుడు మహేశ్ రీరిలీజ్ రికార్డును  బద్దల కొట్టేలాగా ఉన్నారు చిరు. చిరు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆగస్టు 22న మళ్లీ విడుదల కాబోతున్న ఇంద్ర తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ద్వారా రీరిలీజ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర రిరిలీజ్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రీరిలీజ్ లో ఇంద్ర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి

Show comments