Site icon NTV Telugu

Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!

Murari 4k Vs Indra 4k

Murari 4k Vs Indra 4k

Indra 4K failed to Break Murari 4k Day 1 Records: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో.. ఒక్క ప్రభాస్ మాత్రమే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. టైర్ 2 హీరోల పరంగా చూస్తే నాని గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. అలాగే.. విశ్వక్ సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మిగతా హీరోలంగా ఒక్క కమర్షియల్ సినిమా చేయడానికి ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులు నిరాశకు గురవుతునే ఉన్నారు. కొత్త సినిమాలు రాకపోయిన సరే.. కనీసం రీ రిలీజ్‌ సినిమాలతో అయిన సరిపెట్టుకుందామనే స్థితిలో ఉన్నారు. అందుకే.. టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌ నడుస్తోంది. రీసెంట్‌గా మహేష్‌ బాబు కల్ట్ క్లాసిక్ ‘మురారి’ రీ రిలీజ్ అవగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 5.4 కోట్ల గ్రాస్ రాబట్టగా.. మొత్తంగా 9 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Pawan Kalyan: వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటాం..

అయితే.. ఇదే ఊపులో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా మురారి రికార్డ్ బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. మెగాస్టార్ బర్డ్ డే సందర్భంగా ఆగష్టు 22న వైజయంతీ మూవీస్ వారు 385 థియేటర్లలో ఇంద్ర మూవీని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్‌కు చిరు బర్త్ డే అతి పెద్ద వేడుక కావడంతో.. ఇంద్ర రీ రిలీజ్‌తో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఈ సినిమా మురారి డే వన్ వసూళ్లను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఇంద్ర రీ రిలీజ్ వసూళ్లు 3.05 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ మెగాస్టార్ రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర దుమ్ముదులిపేసిందనే చెప్పాలి. అయితే.. మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఇంద్ర రీ రిలీజ్ ఇచ్చిన కిక్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.

Exit mobile version