NTV Telugu Site icon

Sarabjit: కంగనా సినిమా ‘ఎమర్జెన్సీ’ ని నిషేధించాలి.. లేదంటే..! ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు హెచ్చరిక

Kangana

Kangana

కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఫరీద్‌కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్‌జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరబ్‌జిత్ సింగ్ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. అందులో ‘ఎమర్జెన్సీ’ చిత్రం సిక్కు సమాజాన్ని తప్పుగా చూపుతుందని.. దాని వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

READ MORE: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..

సరబ్‌జిత్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌..
సరబ్జిత్ సింగ్ ఖల్సా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఇలా వ్రాశారు.. ‘కొత్త చిత్రం ఎమర్జెన్సీలో సిక్కులను తప్పుగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు ముప్పు కలగవచ్చనే భయం నెలకొంటోంది. ఈ సినిమాలో సిక్కులను వేర్పాటు వాదులుగా, ఉగ్రవాదులుగా చూపించారంటే అది భారీ కుట్రగా భావిస్తున్నాం. ఈ చిత్రం ఇతర దేశాలలో సిక్కులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి కారణమవ్వొచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఆపాలి. దేశంలో సిక్కులపై విద్వేషపూరిత దాడుల వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ చిత్రం సిక్కు సమాజంపై ద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేలా ఉంటుంది. సిక్కు సమాజం ఈ దేశం కోసం గొప్ప త్యాగాలు చేసింది. వాటిని పూర్తిగా సినిమాల్లో చూపించలేదు.” అని పేర్కొన్నారు.

READ MORE:YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు

సరబ్‌జిత్‌ ఫేస్‌బుక్‌లో.. “సిక్కుల పరువు తీసే ప్రతి ప్రయత్నం జరుగుతోంది. సమాజ సామరస్యం, చట్టపరమైన క్రమంలో, అభ్యంతరకరమైన సినిమాలు, పాటలను నిషేధించాలి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తాను. ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా నా గర్జిస్తాను. వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాను.” అని రాసుకొచ్చారు.

READ MORE:Top Headlines @5PM : టాప్ న్యూస్

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా ఎవరు?
సరబ్జిత్ సింగ్ ఖల్సా బియాంత్ సింగ్ కుమారుడు. 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ కింద అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో బియాంత్ సింగ్ ఒకరు. ఇప్పుడు కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమాతో తెరపైకి వస్తోంది. ఇందులో 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలం, ఇందిర పోరాటం, ఆమె హత్య కథను చూపించనున్నారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ వంటి తారలు ఆయనతో ఈ చిత్రంలో పనిచేశారు.