NTV Telugu Site icon

Pushpa 2 : ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప 2’.. నేడు థాంక్యూ మీట్

Pushpa

Pushpa

డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప2. అటు బాలీవుడ్ లోను బాక్సాఫీస్ రికార్డులను ఇండియన్ సినిమా హిస్టరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కింగ్ ఖాన్ షారుక్ సినిమాను సైతం వెనక్కి నెట్టి ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధించాడు పుష్ప రాజ్

Also Read :Thandel : తండేల్ డే 1.. దుల్లకొట్టేసిన నాగ చైతన్య

కాగా నేడు పుష్ప థాంక్స్ మీట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకకు ఫ్యాన్స్ ప్రవేశం లేదని తెలుస్తోంది. పుష్ప 2 చెందిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో పాటు పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లను పిలుపు అందినట్టు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ కు స్పెషల్ షీల్డ్ ను అందజేయనున్నారట. రిలీజ్ కు ముందు రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకున్న పుష్ప బ్లాక్ బస్టర్ టాక్ తో అటు నిర్మాతలకు ఇటు పంపిణి దారులకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అయితే ఈ రోజు ఈవెంట్లో చిత్ర హీరో అల్లు అర్జున్ లాంగ్ స్పీచ్ ఉండే అవకాశం లేకపోలేదు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పాల్గొన బోతున్నఈవెంట్ కావడంతో బన్నీస్పీచ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మీడియా సిర్కిల్స్ తో పాటు అటు ఫ్యాన్స్ లోను ఇటు టాలీవుడ్ సిర్కిల్స్ లోను నెలకొంది. సాయంత్రం 5 గంటలకు పుష్ప 2 థాంక్యూ మీట్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది.