దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో థియేటర్ల ఓపెనింగ్ కు మాత్రం మరికొద్ది రోజుల వరకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయం ఎక్కువగా వినబడుతోంది. అయితే ఈ నెల చివరి వారంలో షూటింగ్స్ కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బడా సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలకు రెడీ అయితే గాని థియేటర్ల యాజమాన్యాలు సినిమాహాళ్లను ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్ లో థియేటర్స్ ఓపెనింగ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.
షూటింగులు ప్రారంభించే అవకాశం.. థియేటర్ల ఓపెనింగ్ కష్టమే!
