Immortal Success Surprise : సినిమా హిట్ అయితే హీరోలకు నిర్మాతలు ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇవ్వడం ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. అయితే ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఈ ట్రెండ్‌ను కాస్త మార్చేశారు. తన సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ హీరోకు కారు కాకుండా బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ హీరో, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరియప్పన్ చిన్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్‌కు రిలీజ్ తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీ సక్సెస్‌తో నిర్మాత అరుణ్‌కుమార్ ధనశేఖరన్.. హీరో జి.వి.ప్రకాశ్‌కు ప్రత్యేకమైన గిఫ్ట్ అందించారు.
జి.వి. ప్రకాశ్‌కు కొత్త RX100 మోడల్ బైక్‌ను ఆయన గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కార్లు, ఖరీదైన వాచీలు వంటి గిఫ్ట్‌లు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ నిర్మాత ఏకంగా బైక్‌ను కానుకగా ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఇమ్మోర్టల్’ను అరుణ్‌కుమార్ ధనశేఖరన్ తన AK Film Factory బ్యానర్‌పై నిర్మించారు. కొత్త డైరెక్టర్ మరియప్పన్ చిన్నా తెరకెక్కించిన ఈ చిత్రంలో టి.ఎం.కార్తీక్, కుమార్ నటరాజన్, లోల్లు సభా మారన్, ఆదిత్య కతిర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందించారు. మొత్తానికి.. హీరోలకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చే ట్రెండ్‌కు భిన్నంగా నిర్మాత బైక్‌ను కానుకగా ఇవ్వడం ‘ఇమ్మోర్టల్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హైలైట్‌గా మారింది.
#Immortal the happy producer a brand-new watch and a Yamaha RX100 bike to @GVPrakash . Success celebration for the team 💥 pic.twitter.com/hrFfIl8vk9
— Rajasekar (@sekartweets) September 9, 2026

