Site icon NTV Telugu

SS Rajamouli : ఐ బొమ్మ రవి మీ పర్సనల్ డేటా అమ్ముకుంటున్నాడు.

Rajamouli

Rajamouli

టాలీవుడ్ ను వెంటాడుతున్న పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు అడ్డుకట్ట వేశారు తెలంగాణ పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి బెండు తీశారు పోలీసులు. పైరసీ ముఠా నుండి ఇండస్ట్రీని కాపాడిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. . అనంతర మీడియా సమావేశంలో SS రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Akkineni Nagarjuna : తమిళనాడు పోలీసులు చేయలేనిది తెలంగాణా పోలీసులు చేసి చూపించారు.. హ్యాట్సఫ్

అయన మాట్లాడుతూ ‘ దమ్ముంటే పట్టుకొండని పోలీసులకు సవాల్ చేసి, భస్మాసుర హస్తం లా తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు ఇమ్మడి రవి. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. Nothing is free. ఏది ఎవరికీ ఊరికే రాదు. ఐ బొమ్మ లో ఉచితంగా సినిమాలు ఎలా వస్తున్నాయి. అలా ఎలా ఇస్తున్నారని మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా. మీరు ఐ బొమ్మలో సినిమాలు చూస్తుంటే మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అసలు అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఇమ్మడి రవికి ఆ డబ్బు ఎలా వస్తుంది. ఆ పైరసీ సైట్స్ లో సినిమాలో చూసి మీకు తెలియకుండా ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు..మా సినిమా వాళ్ళ కంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారు. ఐ బొమ్మ రవిని పట్టుకుని అరెస్ట్ చేసి, పైరసీ వెబ్ సైట్స్ ను కట్టడి చేసిన తెలంగాణ పొలిసు శాఖవారికి సీపీ సజ్జనార్ కు థాంక్యూ’ అని అన్నారు.

Exit mobile version