Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సారి కూడా తల్లి కాబోతుంది. వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా..
ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాస్తా టైం గడిపింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ఓ హిట్ మూవీ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూ.. ‘‘మేడమ్.. ‘రైడ్ 2’ సినిమాలో మీరెందుకు నటించలేదు? మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు ఉంటుంది?’’ అని అడిగాడు.. ఇలియానా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీని నేనెంతో మిస్ అవుతున్నా. ‘రైడ్’ నాకెంతో ప్రత్యేకమైన మూవీ. నాక్కూడా ఆ సినిమాలో భాగం కావాలనిపించింది. మాలిని పాత్రలో మరోసారి ఒదిగి పోవాలనుకున్నా. మా దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా, నటుడు అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి వర్క్ చేయాలని నాక్కూడా ఉంది. నిజం చెప్పాలంటే, సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్ చేయమని అడిగింది. కానీ అదే సమయంలో నాకు బాబు పుట్టాడు. దీనివల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కానీ మీ అందరికోసం భవిష్యత్తులో తప్పకుండా మంచి కం బ్యాక్ అయితే ఇస్తా’ అని ఇలియానా బదులిచ్చింది.
Also Read
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
- Tags
- Ileana
- re-enter
- viral comment
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..