Site icon NTV Telugu

Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..

Ileana

Ileana

గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్‌ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా.  ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సారి కూడా తల్లి కాబోతుంది. వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా..

ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాస్తా టైం గడిపింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. ఓ హిట్‌ మూవీ సీక్వెల్‌ గురించి ప్రశ్నిస్తూ.. ‘‘మేడమ్‌.. ‘రైడ్‌ 2’ సినిమాలో మీరెందుకు నటించలేదు? మీ కమ్‌బ్యాక్‌ ఎప్పుడు ఉంటుంది?’’ అని అడిగాడు.. ఇలియానా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీని నేనెంతో మిస్‌ అవుతున్నా.  ‘రైడ్‌’ నాకెంతో ప్రత్యేకమైన మూవీ. నాక్కూడా ఆ సినిమాలో భాగం కావాలనిపించింది. మాలిని పాత్రలో మరోసారి ఒదిగి పోవాలనుకున్నా. మా దర్శకుడు రాజ్‌కుమార్‌ గుప్తా, నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌తో కలిసి వర్క్‌ చేయాలని నాక్కూడా ఉంది. నిజం చెప్పాలంటే, సీక్వెల్‌ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్‌ చేయమని అడిగింది. కానీ అదే సమయంలో నాకు బాబు పుట్టాడు. దీనివల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కానీ మీ అందరికోసం భవిష్యత్తులో తప్పకుండా మంచి కం బ్యాక్ అయితే ఇస్తా’ అని ఇలియానా బదులిచ్చింది.

Exit mobile version