Site icon NTV Telugu

Ileana : సెట్‌లో ఆ డైరెక్టర్ అలా చేయడంతో ఏడ్చేసా..

Ileana

Ileana

టాలీవుడ్‌లో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా, తెలుగు సినిమాలకు దూరంగా ఉండి చాలా కాలం అవుతుంది. అనంతరం కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొన్ని చిత్రాలు చేసిన ఆమె, తన విదేశీ ప్రియుడిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా కొత్త జీవితం ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగతం, వృత్తిగతం ఇలా అనేక విషయాలను పంచుకుంది. అందులో ముఖ్యమైన అంశం ఆమె తొలి హిందీ చిత్రం బర్ఫీ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం.

Also Read : Shreya Dhanwanthary : ఇస్లామోఫోబి‌క్ వీడియో పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఫైర్

ఇలియానా మాట్లాడుతూ.. ‘ ‘బర్ఫీ’ మూవీ సెట్ లో దర్శకుడు అనురాగ్ బసుతో నాకు ఒకసారి ఘర్షణ ఎదురైంది. ఆ రోజు చాలా హ్యాపీగా సెట్‌కి వెళ్లాను. కానీ అప్పటికే బసు సర్ మానసికంగా బాగోలేరు, ఏదో టెన్షన్‌లో ఉన్నారు. నేను వెళ్ళగానే నాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దాంతో నేను షాక్ అయ్యాను. నిజంగా చాలా బాధపడ్డాను. ఆ సమయంలో ‘దాదా.. వినండి.. నేను ఈ పాత్రకు సరైన దానిని కాదని మీరు అనుకుంటే.. నా వర్క్ విషయంలో మీరు సంతోషంగా లేకుంటే నేను వెళ్ళిపోతాను. నేను మీ పై దావా వేయబోవ‌డం లేదు. నేను వెళ్తున్నానని చెప్పాను. ఒక దశలో ఏడుస్తూ నిర్మాతకు కాల్ చేయాలనిపించిన సందర్భం కూడా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని, అనురాగ్ బసు‌తో ఎలాగోలా అడ్జస్ట్ అయి సినిమా పూర్తి చేశా. చివరికి బర్ఫీ చిత్రానికి జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది’ అని ఇలియానా పేర్కొంది. ఆమె మాటల్లో, “క్రియేటివ్ రంగంలో ఎవరికైనా ఏమి నచ్చుతుందో, ఏమి నచ్చదో చెప్పలేం. కానీ ఆ అనుభవం నాకు బలాన్ని ఇచ్చింది” అని కాన్ఫిడెంట్‌గా వెల్లడించింది.

Exit mobile version