Site icon NTV Telugu

Ileana : పాపం.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ఇలియానా

Ileana

Ileana

నటి ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, మొదటి సినిమాతోనే యువత గుండెల్లో గూడు కట్టేసి, ఇక్కడే సెటిలైంది. చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా టాప్ హీరోలతో నటించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ వైపు పయనించింది. బాలీవుడ్‌కు వెళ్లాక అక్కడ చక్కగా సినిమాలు చేస్తుందనుకుంటే, ఎవరితోనో ప్రేమలో పడింది. ఆ ప్రేమ బ్రేకప్ కావడంతో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు పూర్తిగా దూరమైంది.

Also Read:Akash Puri : బడా సినిమాలో ఆకాశ్ పూరి..?

తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి, తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోనే బాగా స్థిరపడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో, వివాహం చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది. అలాగే ఆమె మరోసారి తల్లికాబోతున్నట్టు ప్రకటించింది కూడా. అయితే ఆ కారణంగా ఆమె ఒక మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

Also Read:SSMB29: మరో స్టార్ హీరోను దింపుతున్న జక్కన్న

అసలు విషయం ఏమిటంటే, ఆమె ‘రైడ్’ అనే సినిమాలో మాలినీ పట్నాయక్ అనే పాత్రలో నటించింది. 2018లో రిలీజైన ఈ సినిమాకు 2025లో సీక్వెల్ వచ్చింది. ఆమె తల్లి కాబోతున్న కారణంగా, ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను తీసుకోవాల్సి వచ్చిందని తాజాగా సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా వెల్లడించారు. అయితే, ఈ విషయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, అవేవీ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. “ఇలియానా మళ్లీ ఎప్పుడు వచ్చినా, ఆమె పాత్ర ఆమె కోసం ఉంటుంది,” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version