Site icon NTV Telugu

Ileana : మూడో సారి తల్లి కాబోతున్న మహేశ్ బాబు హీరోయిన్..

Iliyana

Iliyana

స్టార్ హీరోయిన్ ఇలియానా తన సినిమాల కంటే ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. ఇలియానా ముందుగా కోవా ఫీనిక్స్ డోలన్ కు జన్మనిచ్చి, ఆ తర్వాత కీను రాఫే డోలన్‌కు జన్మనిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది .

Also Read : Rani Mukerji: ప్రేక్షకుల అంగీకారం.. నాకు అవార్డు కంటే గొప్ప

ఇలాంటి సంతోషకరమైన వార్త ఇలియానా తన అభిమానులతో పంచుకోవడానికి బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో లో ఆమె బేబీ బంప్ తో ఊయల సర్దుతూ కనిపించి. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీన్ని చూసి అభిమానులు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సంతోషకరమైన క్షణాన్ని తమ సోషల్ మీడియా లో రీ పోస్టుల ద్వారా పంచుకుంటూ, ఆమె కుటుంబ జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇద్దరి పిల్ల లాగానే మూడో బిడ్డకు జన్మనివ్వడానికి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.

 

Exit mobile version