NTV Telugu Site icon

Manjummel Boys : ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్ కు ఇళయరాజా నోటీసులు..

Ilayaraja

Ilayaraja

Manjummel Boys : ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చింది.ఓటిటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇలా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ యూనిట్ కు అనుకోని షాక్ తగిలింది.

Read Also :Mokshagna : బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చేది అప్పుడేనా..?

మంజుమ్మల్ బాయ్స్ చిత్ర యూనిట్ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు.ఈ సినిమా క్లైమాక్స్‏లో తాను కంపోజ్ చేసిన “గుణ” చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెంది ఉంటాయి.తమ సినిమా లో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందిన వ్యక్తికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments