Site icon NTV Telugu

Ilayaraja : భారత రక్షణ శాఖ‌కు విరాళం అందించిన ఇళయరాజా..

Ilayaraja

Ilayaraja

ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్ పాక్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భారత్. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయినప్పటికి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. అయితే, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొంది. అయితే ఈ విషయం పై ఇప్పటికే నటినటులు సెలబ్రెటీలు అంతా కూడా రియాక్ట్ అవుతూ భారత రక్షణ శాఖకు తోచినంత సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా భారత రక్షణ శాఖకు తన ఒకరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఇళయరాజా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Also Read : Puri : పూరీ-విజయ్‌ సేతుపతి మూవీలో విద్యా బాలన్ పాత్ర ఎంటో తెలుసా..

‘పహల్గామ్‌లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడి చేసింది. దీనికి మన దేశ సైనికులు తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి. వారి ధైర్య సాహసాలు అభినందనీయం. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకం నాకు ఉంది. దేశ పౌరుడిగా, ఎంపీగా నా ఒకరోజు పారితోషికాన్ని దేశ రక్షణ శాఖకు విరాళంగా ప్రకటిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version