Site icon NTV Telugu

Ilaiyaraaja: ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Illay Raja

Illay Raja

భారతీయ సంగీత రంగంలో అపార కీర్తి పొందిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు చెందిన 500కు పైగా పాటల కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌తో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌.వి. అంజరియా ఉన్నారు. విచారణ అనంతరం వారు పిటిషన్‌లో ప్రస్తావించిన కారణాలు సరిపోవని తేల్చారు.

Also Read :  Parineeti Chopra: రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. భర్త పై పరిణీతి షాకింగ్ కామెంట్ !

ఇళయరాజా పేరుతో బాణీలు వెలువడిన అనేక సినిమాల మ్యూజిక్ హక్కులపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఈ వివాదాన్ని తన సొంత రాష్ట్రమైన తమిళనాడు‌లో పరిష్కరించుకోవాలని భావించి మద్రాస్ హైకోర్టుకు కేసును బదిలీ చేయాలంటూ కోరారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఈ అభ్యర్థనను అంగీకరించలేదు. దీంతో ఇళయరాజా అభిమానుల్లో ఈ నిర్ణయం నిరాశను కలిగించినప్పటికీ, ఆయన తుది న్యాయపోరాటం ఎలా మలుపుతీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Exit mobile version