NTV Telugu Site icon

IIFA Awards : ఈసారి ఆ ఇద్దరు స్టార్ హీరోల సందడి

Iifa Utsavams Telugu 2024

Iifa Utsavams Telugu 2024

IIFA Awards Telugu 2024 Teja sajja and Rana Daggubati to host: మరి కొద్ది వారాల్లో తెలుగు సినిమా అవార్డ్స్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది పలు ప్రఖ్యాత సంస్థలు సినిమాలకు అవార్డులు అందిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది అనౌన్స్ చేసిన మొదటి ప్రతిష్టాత్మకమైన IIFA అవార్డులు త్వరలోనే జరగనున్నాయి. ఈ ప్రముఖ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ప్రతి ఏడాది జరిగే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 7, 8వ తేదీలలో దుబాయ్ లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇక ప్రతి ఏడాది ఒక స్పెషల్ హీరో ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తూ ఉంటాడు.

Kolkata Video: రైల్వే క్రాసింగ్ గేట్‌లోపలికి వచ్చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన రైలు

ఈసారి ఇద్దరు హీరోలు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా బాహుబలి ఫేమ్ రానాతో కలిసి హోస్టింగ్ చేయనున్నారు. ఈ ఏడాది జరిగే ఈవెంట్‌కి తెలుగు సినిమా నుండి కొంతమంది పెద్ద స్టార్స్‌ని తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తేజ, రానాతో పాటు ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందాని అంటున్నారు. 2023లో కొన్ని పెద్ద సినిమాలు వచ్చాయి, ఈ క్రమంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాం రేపు హైటెక్స్ లో ఘనంగా జరగబోతోంది.