NTV Telugu Site icon

NBK 109: బాలయ్య కూడా ఆరోజే వస్తే..దబిడి..దిబిడే..

Untitled Design (17)

Untitled Design (17)

కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక విడుదల అనుకోగా ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. దీంతో షూట్ వాయిదా పడుతూ వచ్చింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇటీవల బాలయ్య షూటింగ్ లో అడుగు పెట్టారు. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ డేట్ కు వస్తే వారం గ్యాప్ లో అనగా 25న రానున్న శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ నుండి గట్టి పోటీ ఉంటుంది. వారం గ్యాప్ లోరా రావడం వలన కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పుష్ప-2, కన్నప్ప కూడా డిసెంబర్ లో రానున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న బాలయ్య, బాబీ చిత్రానికి ‘వీరమాస్’ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు విశేష స్పందన దక్కించుకున్నఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Also Read : Tolly Wood: చిన్న సినిమా.. పెద్ద విజయం.. ఏమిటా సినిమా..?

Show comments