Site icon NTV Telugu

iBomma One: ఐ-బొమ్మ పోయే ఐ బొమ్మ వన్ వచ్చే

Ibomma One

Ibomma One

ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ 1 అనే ఒక వెబ్‌సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ 1 ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది.

Also Read :Delhi Car Blast: ‘‘హిజాబ్ ఎందుకు వేసుకోలేదు’’.. రోగులతో ఉగ్ర డాక్టర్..

ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమా చూడాలని ప్రయత్నించి లింక్ మీద క్లిక్ చేయగా, అది మూవీ రూల్స్ (Movie Rulz) వెబ్‌సైట్‌కి రీ-డైరెక్ట్ అవుతోంది. ఐ-బొమ్మ లాగానే మూవీ రూల్స్ వెబ్‌సైట్ కూడా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఈ సైట్ ఏకంగా సినిమాల హెచ్‌డీ ప్రింట్‌తో పాటు, అప్పుడే రిలీజ్ అయిన సినిమాల థియేటర్ ప్రింట్‌లను సైతం అప్‌లోడ్ చేస్తూ వస్తోంది.

Also Read :Ghattamaneni Jayakrishna: జయకృష్ణ డెబ్యూ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

ఇక ఐ-బొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ సైట్స్ (Mirror Sites) ఉన్నాయని, అందులో ఒకటిగా ఐ-బొమ్మ 1 ను తెరమీదకు తెచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఇంకా నడుస్తున్న మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్‌సైట్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఈ నేపధ్యంలో విచారణ కూడా జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను పోలీసులు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version