Site icon NTV Telugu

SS. Rajamouli : ‘జూనియర్‌’ సినిమా ఫస్ట్ డే చూడాలని ఉంది

Junior

Junior

గాలి కిరీటి రెడ్డి హీరోగా, రాధా కృష్ణ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘జూనియర్‌’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Read : Sreeleela : క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీలీల

ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారు అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. చాలా పెద్ద సినిమా చేశారు. సినిమా 1000 + ప్లస్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్ కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. జెనీలియా అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారని నమ్మకం ఉంది. దేవి ఎప్పుడు కూడా తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. సెంథిల్ గురించి చెప్పాలంటే సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది. జూలై 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. పైసా వసూల్ మూవీ ఇది. అందరికీ థాంక్యు.’అన్నారు.

Exit mobile version